దేశానికి ప్రధానైనా తల్లికి కొడుకే..! అందుకే ప్రభుత్వ, రాజకీయా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ వీలు చేసుకొని తన తల్లిని కలుస్తుంటారు ప్రధాని మోదీ. గుజరాత్‌కు వెళ్లి ఆమెతో గడుపుతుంటారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ.. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఉన్న తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు…