ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులుగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ముందుకెళ్లే పరిస్థితి లేదు.. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. తిండి తిప్పలు లేవు. ఇలా నాలుగు రోజులుగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు.
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. రేపు శోభాయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాంపల్లి, బేగంబజార్, మోజం జై మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Nizam College: నిజాం కాలేజ్ గర్ల్ హాస్టల్ లో యూజీ విద్యార్థినిలకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లో చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు.
హిమాలయ దేవాలయాలకు యాత్ర ప్రారంభమైన ఒక రోజు తర్వాత శనివారం చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు కనిపించారు. యమునోత్రి వద్ద భారీగా రద్దీ ఉంది. మొదటి రోజు సుమారు 45,000 మంది యాత్రికులు దర్శనమ్ చేసుకున్నారు. ప్రజలు ఆలయానికి వెళ్లే ఇరుకైన మార్గంలో నడవడం కూడా కష్టమైంది. కేదార్నాథ్ లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ మొదటి రోజు సుమారు 30,000 మంది వచ్చారు. ఇంతలో, ఇద్దరు యాత్రికులు మధ్యప్రదేశ్లోని సాగర్…
Tank Bund: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలను తలపించే విధంగా భారీ స్థాయిలో దుర్గా మాత వాహనాలు టాంక్ బండ్ పై భారీగా తరలి వచ్చాయి.
కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారత్ బంద్ నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు నేడు తనిఖీలు…