Telangana Rains: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.