ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. ఇక, భారత దేశవ్యాప్తంగా మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టీకా 12నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. అయితే పిల్లలకు కార్బివాక్స్ వ్యాక్సిన్ మాత్రమే వేయనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషన్ ఆదేశాలు పంపారు. Read Also: Punjab: నేడు భగవంత్ మాన్…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే చాలా రాష్ట్రాలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి… దీంతో.. ఆయా రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరింది తమిళనాడు ప్రభుత్వం.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు రాష్ట్ర ప్రజారోగ్య…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక,…
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పెద్ద సంఖ్యలోనే వెలుగు చూస్తున్నాయి.. ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవ్వడమే కాదు.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. అయితే, దీనికి కారణం.. ఫస్ట్ వేవ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత.. ప్రజలు లైట్‌గా తీసుకోవడమే కారణం అని పలు సందర్భాల్లో నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కేసులు తగ్గుతూ వస్తున్నా.. ఇంకా భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి.. ఈ…
130 కోట్లకు పైగా జనాభా ఉండే భారత్ లో కరోనా కేసులు భరోగా నమోదవుతున్నాయి. రోజుకు 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. అలాగే అందరూ తప్పకుండ భౌతిక దూరం పాటించాలి.. మాస్కులు ధరించాలి అని చెబుతున్నాయి. కానీ మన దేశంలో సంగంమంది మాస్కులు ధరించడం లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన…
కరోనా పెను సవాల్‌గా మారింది.. దానిపై జరిపే పోరాటంలో విజయం సాధించడానికి ఉమ్మడి వ్యూహం, ప్రయత్నం అవసరం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనా పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ రాష్ట్ర, జిల్లా అధికారులతో మాట్లాడారు.. కోవిడ్ పై చేసిన యుద్ధంలో మోడీ నాయకత్వానికి ఈ సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు అధికారులు.. ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితి మెరుగుపడటం గురించి ప్రధానికి వివరించారు.. రియల్ టైమ్ పర్యవేక్షణ, సామర్థ్యం పెంపు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను పెద్దలందరికి అందించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 88 లక్షల టీకాలు ఉన్నాయిని, మరో మూడు రోజుల్లో 28 లక్షల టీకాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మే 1 వ తేదీ నుంచి దేశంలో…