New Director to NIMS: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కి కొత్త డైరెక్టర్ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్ పొందాల్సి ఉండటంతో నిమ్స్‌కి కొత్త డైరెక్టర్‌ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది.