ఈ సువిశాల విశ్వంలో మానవుడు తెలుసుకున్నది దాదాపుగా మహాసముద్రంలో నీటి బిందువు అంతే. కానీ మానవుడి నిరంతర పరిశోధనల ద్వారా విశ్వానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏలియన్స్ జాడతో పాటు, విశ్వంలో భూమిని పోలిన గ్రహాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే భూమిని పోలిన గ్రహాలను కనుక్కున్నారు. ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉండే వీటిని చేరాలంటే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం దాదాపుగా అసాధ్యం. నిజానికి మానవుడు ప్రయోగించిన ఏ…