(జూన్ 10న ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి)ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల విందు అందించాలన్న సత్సంకల్పంతోనే ‘విజయా’వారు సినిమాలు తీశారు. ‘విజయా’వారి చిత్రాల్లోని పాటల మకుటాలతోనే సినిమాలు తీసి అలరించారు దర్శకరచయిత జంధ్యాల. అలాంటి జంధ్యాల దగ్గర పనిచేసిన ఇ.వి.వి.సత్యనారాయణ కూడా గురువు బాటలోనే పయనిస్తూ పలు నవ్వుల నావలు తయారు చేసి, సంసారసాగరాన్ని ఈదుతున్న…