(మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు)సినిమా రంగం అంటే ఎంతోమందికి మోజు. అక్కడ రాణించాలని, తారాపథంలో సాగిపోవాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా చూసి, అందులో తనకు నచ్చిన పాత్రను తానయితే ఇలా చేస్తాననీ కలల్లో తేలిపోతారు. అయితే స్వప్నాలను సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. చిత్రసీమలో అలాంటివారికి కొదువలేదు. వారిలో నిన్నటి హీరో, నేటి కేరెక్టర్ యాక్టర్, విలన్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. బిట్ రోల్స్ లో మొదలైన శ్రీకాంత్ సినీ…