హవానా సిండ్రోమ్ వ్యాధిపై ఇండియాలో కూడా కొంత ఆందోళన ఉంది. భారత్‌లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉందా? లేదా? అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. అనుమానాలు, ఆందోళన మాత్రం ఉంది.
కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రపంచాన్ని.. ఇప్పుడు హవానా సిండ్రోమ్ వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్‌కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్‌లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సీఐఏ డైరెక్టర్‌కు హవానా సిండ్రోమ్ లక్షణాలపై ప్రస్తుతం అమెరికా దర్యాప్తు జరుపుతోంది. ముఖ్యంగా అమెరికా దౌత్యవేత్తలు, ఇంటెలిజన్స్ అధికారులు మాత్రమే వాహనా సిండ్రోమ్…