మహాభారతంలో ద్రౌపది కథను అందరూ వినే ఉంటారు. ఆమె ఐదుగురు భర్తలు. ఈ ఐదుగురు అన్నదమ్ములైన పాండవులు. అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకునే సంస్కృతి దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ సంప్రదాయంగా వస్తోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని శిల్లాయ్ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. శిల్లాయ్ గ్రామంలో హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒకే వధువును వివాహం చేసుకున్నారు.