లైంగిక వేధింపుల కేసులో హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను పోలీసులు ఆదివారం దాదాపు ఏడు గంటల పాటు విచారించారని మంత్రి తరపు న్యాయవాది డి.సబర్వాల్ సోమవారం తెలిపారు. ఆయన రెండు ఫోన్‌లోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళా కోచ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మంగళవారం పేర్కొన్నారు.
శుక్రవారం జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్‌పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సున్నితంగా మందలించారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు.