Youtuber Harsha Sai Instagram Post: యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే హర్ష నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా తనపై నమోదైన కేసుపై హర్షసాయి స్పందించాడు.…