న్యూజిలాండ్ పర్యటన సమయంలో తాను చేసిన తప్పుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బ్రూక్కు ‘ఫైనల్ వార్నింగ్’ ఇచ్చి.. 30,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.36.29 లక్షలు) జరిమానాగా విధించింది. మద్యం మత్తులో ఓ నైట్‌క్లబ్ వద్ద గొడవకు దిగడమే ఇందుకు కారణం. 2025 నవంబర్ 1న ఈ ఘటన జరగ్గా.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రూక్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి…