మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ హరీష్ రావు.. మీలాగా మాటలు కాదు, చేతల ప్రభుత్వం మాది అని విమర్శించారు. విద్యా, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం అని, శంకుస్థాపన స్థాయిలో వదిలి వెళ్లిపోయిన హాస్పిటల్స్ ఈ 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నాం అని అన్నారు. మీ ప్రభుత్వం 40 వేల కోట్ల బకాయి పెట్టిపోతే.. తాము చెల్లిస్తున్నాంఅని మండిపడ్డారు. నిత్యం మా ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష…