ఒక్కొక్కరికి ఒక్కో వింత అలవాటు ఉంటుంది. కొందరు కొన్ని పదార్ధాలను ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు బలపాలు తింటారు. పెద్దవాళ్లు జంక్ ఫుడ్ తింటారు. అయితే ఒడిశాలోని ఓ వ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. అతడి పేరు హరిలాల్ సక్సేనా. వయసు 68 ఏళ్లు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతడు వలసకూలీగా పనిచేస్తుంటాడు. ఉపాధి కోసం పదేళ్ల కిందట ఒడిశాకు వలస వెళ్లిపోయాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.…