యూపీ రాష్ట్రం సంభాల్‌లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.