బండి .. బండి రైలు బండి.. వేళకంటూ రాదులేండి.. దీన్ని గాని నమ్మూకుంటే ఇంతేనండీ.. ఇంతేనండీ.. నితిన్ నటించిన ‘జయం’ సినిమాలోని పాట మీకు గుర్తుందా? దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అందుకే సినిమాల్లో కూడా పాట రూపంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే ఈ అపవాదను పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి.…