ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హరిత ఆత్మహత్య కేసులో పోలీసులు ఏడుగురు లోన్ రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హరిత ఆత్మహత్యకు బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.