తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి, అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి, అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే విజయశాంతికి ‘సరిలేరు ఎవ్వరూ’ అని జనం జేజేలు పలికారు. ఆ మధ్య విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు.…
(జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు)విజయశాంతి మళ్ళీ నటిస్తున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక విజయశాంతి మునుపటి అభినయాన్ని ప్రదర్శించగలదా – అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలా విజయశాంతి రీ ఎంట్రీపై చర్చోపచర్చలు సాగాయి. ఎన్ని చర్చలు సాగినా, విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలచిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి విజయశాంతి రీ ఎంట్రీ కార్డ్…