అసలు పేరు కనుమరుగై, కొసరుపేరే నిలచిపోయిన వారు ఎందరో చిత్రసీమలో ఉన్నారు. అంతెందుకు మన మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివశంకర ప్రసాద్. అలా పిలిస్తే చిరంజీవి అభిమానుల్లోనే కొందరు గుర్తుపట్టలేరు. అలాగే సినిమాలోని పాత్ర పేరునే ఇంటిపేరుగా చేసుకొని జనం ముందు నిలిచారు జేడీ చక్రవర్తి. ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాసచక్రవర్తి. ఆ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టలేరు. అదే జేడీ చక్రవర్తి అనగానే ఆయన తెరపై కనిపించిన తొలి చిత్రం ‘శివ’ను…