భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్…