తెలుగునాట బహుముఖ ప్రజ్ఞకు నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి సూపర్ స్టార్ ఎవరంటే? చప్పున యన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. నిజానికి రామారావు కంటే ముందు భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని, నటునిగా ఉన్నతశిఖరాలను అధిరోహించి, తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఘనులు చిత్తూరు వి.నాగయ్య. నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు…