Boyapati Srinu: పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే స్టార్ డైరెక్టర్ అయిపోయారు బోయపాటి శ్రీను. నవతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో చోటు దక్కించుకున్న బోయపాటి శ్రీను ఇప్పటి దాకా తొమ్మిది చిత్రాలు రూపొందించగా, అందులో మూడు సినిమాలు ఆట్టే ఆకట్టుకోలేక పోయాయి. దాంతో బోయపాటి సక్సెస్ రేటు 66.6 శాతం నమోదయింది.
దాసరి గారు, రాఘవేంద్ర రావు తర్వాత బీ గోపాల్ కమర్షియల్ సినిమాలని అగ్రెసివ్ గా చేశారు. అత్యధిక హిట్ పర్సెంటేజ్ ఉన్న బీ గోపాల్ తరం అయిపోతుంది అనుకునే సమయానికి వీవీ వినాయక్, రాజమౌళిలు బయటకి వచ్చారు. దాదాపు దశాబ్దం పాటు ఈ ఇద్దరు దర్శకులు బాక్సాఫీస్ పై కమర్షియల్ సినిమాలతో దండయాత్ర చేశారు. వినాయక్ ‘ఆది’ సినిమా చేస్తే, రాజమౌళి సింహాద్రి సినిమా చేశాడు. వినాయక్ ఠాగోర్ అంటే రాజమౌళి ఛత్రపతి అన్నాడు. మాస్ సినిమాలని,…
(ఏప్రిల్ 25న బోయపాటి శ్రీను పుట్టినరోజు) తెలుగు చిత్రసీమలో ఈ తరం మాస్ మసాలా డైరెక్టర్ ఎవరంటే బోయపాటి శ్రీను పేరు ముందుగా వినిపిస్తుంది. ఆయన అన్నిచిత్రాలలోనూ యాక్షన్ ఎపిసోడ్స్ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘లెజెండ్’ చిత్రంతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డుకు ఎంపికైన బోయపాటి శ్రీ నుకు, బి.యన్. రెడ్డి అవార్డును కూడా ప్రకటించడం విశేషం! గుంటూరు జిల్లా పెదకాకాని బోయపాటి శ్రీను స్వస్థలం. అక్కడే వారికి ఓ సొంత ఫోటో స్టూడియో ఉండేది. దాంతో…