Hansika Motwani: హీరోయిన్లు.. గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ రోజులు ఉండాలంటే.. తమ అందాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. అందాన్ని బట్టే ఒక విలువ ఉంటుంది అనేది నమ్మదగ్గ విషయం. అందుకే హీరోయిన్లు అందం కోసం జిమ్ లు, యోగాలు, అవేవి కాకపోతే సర్జరీలు, ఇంజక్షన్స్ వాడుతూ ఉంటారు.
అందాల నాయిక హన్సికా మోత్వాని గత యేడాది డిసెంబర్ 4న తన బోయ్ ఫ్రెండ్ సోహెల్ ఖటూరియాను పెళ్ళి చేసుకుంది. విశేషం ఏమంటే... తన ప్రేమ పెళ్ళి.. అది జరిగిన సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆమె 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా' పేరుతో ఓ స్పెషల్ షో చేసింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది.