టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ 'హ్యాండిల్డ్ ది బాల్' కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్రికెట్‌లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.