వరల్డ్ కప్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిపోయిన బెన్ స్టోక్స్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కాగా.. ఆసుపత్రి ఎదుట చేతి కర్రల సాయంతో నిల్చున్న ఫొటోను స్టోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "ఆసుపత్రిలో చేరాను, డిశ్చార్జి అయ్యాను... శస్త్రచికిత్స జరిగింది... ఇక కోలుకోవడమే మిగిలుంది" అంటూ ట్వీట్ చేశాడు.