విశాఖపట్నంలోని పెందుర్తిలో నకిలీ పోలీసుల హల్చల్ చేశారు. పోలీసులమంటూ బెదిరించి దోపిడీకి దిగారు. యువతీ, యువకుడి ఫొటోస్ తీసి నకిలీ పోలీసుల డబ్బులు డిమాండ్ చేశారు. పోలీస్ యూనిఫాం, ఆర్మీ టోపీ ధరించి యువతీ యువకుడిని బెదిరించారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.