కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసిన హీరోలు ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత లవ్ స్టోరీ సినిమాల్లో నటించడానికి పనికి రారు. వారి ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయి, ప్రేమ కథల్లో ఉండే సెన్సిబిలిటీని మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా చేసిన తర్వాత ప్రేమ కథలో నటించాలి అంటే సగం మంది హీరోలకి కష్టమైన పని. ఈ కష్టమైన పనిని చాలా ఈజ్ తో చేయగలడు నానీ.…