Hi Nanna Teaser: రిపీట్ వాల్యూ ఉన్న ఎమోషనల్ డ్రామా ఈ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసిన హీరోలు ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత లవ్ స్టోరీ సినిమాల్లో నటించడానికి పనికి రారు. వారి ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయి, ప్రేమ కథల్లో ఉండే సెన్సిబిలిటీని మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా చేసిన తర్వాత ప్రేమ కథలో నటించాలి అంటే సగం మంది హీరోలకి కష్టమైన పని. ఈ కష్టమైన పనిని చాలా ఈజ్ తో చేయగలడు నానీ. న్యాచురల్ స్టార్ నానిగా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఎన్ని ప్రేమ కథల్లో నటించినా ఆడియన్స్ ని మెప్పించగలడు. దసరా లాంటి మాస్ కమర్షియల్ సినిమాలో కూడా ఎమోషన్ పండించగలడు. అది కేవలం నానికి మాత్రమే ఉన్న టాలెంట్. అందుకే ఇప్పటికీ నానిని మన హీరో అనుకుంటారు కామన్ ఆడియన్స్.
దసరా తర్వాత ట్రాక్ మాస్ కి మారుస్తాడు అనుకున్న నాని, పూర్తి స్థాయి ప్రేమకథతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. హాయ్ నాన్న అనే సాఫ్ట్ టైటిల్ తో, ఒక పాపకి తండ్రి పాత్రలో నాని నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్న హాయ్ నాన్న సినిమా గ్లిమ్ప్స్ తోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. సమయమా, గాజు బొమ్మ సాంగ్స్ హాయ్ నాన్న సినిమా ఏ టెంపోలో ఉంటుందో తెలిసేలా చేసాయి. ఈ మూడు ప్రమోషనల్ కంటెంట్స్ లో నాని ఎక్స్ప్రెషన్స్ ని ఫిదా అవ్వాల్సిందే. చిన్న చిన్న ఫీలింగ్స్ ని కూడా చాలా ఎఫెక్టివ్ గా, ఎఫర్ట్ లెస్ గా ప్లే చేస్తున్నాడు నాని. లేటెస్ట్ గా హాయ్ నాన్న టీజర్ చూస్తే నానికి సెల్యూట్ కొట్టాల్సిందే. అంత మెచ్యూర్డ్ అండ్ సెటిల్డ్ యాక్టింగ్ ని నాని హాయ్ నాన్న టీజర్ మొత్తం క్యారీ చేసాడు.
Also Read
ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో స్టార్ట్ అయిన టీజర్… మృణాల్ నానిల ప్రేమకథతో ఫీల్ గుడ్ గా సాగింది. నాని-మృణాల్ పెయిర్ బ్యూటిఫుల్ అండ్ ఫ్రెష్ గా ఉండడంతో హాయ్ నాన్న టీజర్ మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. మృణాల్ నానిల మధ్య కెమిస్ట్రీని కూడా ముద్దుల రూపంలో చాలా సింపుల్ గా చూపించాడు దర్శకుడు. సాంగ్స్ తో హాయ్ నాన్న సినిమాకి బజ్ జనరేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్, టీజర్ కి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా టీజర్ ఎండ్ లో నాని, మృణాల్ క్లోజప్ షూట్ అండ్ ఆ టైమ్ లో వచ్చిన మ్యూజిక్ సినిమా ఫీల్ మొత్తాన్ని క్యారీ చేసినట్లు అనిపించింది. ఒక మ్యాజిక్ ని అలా చల్లేసిన హాయ్ నాన్న టీజర్ నాని కెరీర్ లో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అవ్వడం గ్యారెంటీ. టీజర్ రిలీజ్ తో పాటు హాయ్ నాన్న రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. డిసెంబర్ 7న హాయ్ నాన్న సినిమా రిలీజ్ కానుంది, మరి థియేటర్స్ లో హాయ్ నాన్న ఎంత మాయ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!