Gyanvapi Mosque: వారణాసిలో ‘‘జ్ఞానవాపి’’ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై ఇటు హిందూ సంఘాలు, అటు మసీద్ కమిటీ మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ జ్ఞానవాపి మసీదు కాదని, అది శివాలయమే అని అన్నారు. శనివారం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలువడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, అది 'శివుని దేవాలయం' అని చెప్పారు.