అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు…