నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. వివాహం తర్వాత, జీవీ ప్రకాష్ సినిమాటిక్ కెరీర్‌లో సక్సెస్ సాధించగా, సైంధవి సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత జంట మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీరు ఈ విభేదాలను సర్దుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకుల కోసం నిర్ణయం తీసుకున్నారు. Also Read…