గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్మహ్మానాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీపై ఆరోపణలు చేశారు. జీవీ స్వచ్చంధ సంస్థకు ఎన్నారై నిధులు వస్తున్నాయని ఆరోపించారు. దీనిపై జీవీ ఘాటుగా స్ఫందించారు. తన సంస్థకు ఎలాంటి ఎన్నారై నిధులు రావడంలేదని తాను కొటప్పకొండలో ప్రమాణం చేస్తానని అన్నారు. జీవీ ప్రమాణంపై పోలీసులు స్పందించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరూ కూడా బయటకు వెళ్లేందుకు వీలులేదని జీవీకి…