Gutkha: గుట్కా ఒక యువకుడి ప్రాణాలు మీదకు తెచ్చింది. తన భార్య వేరే వ్యక్తి నుంచి గుట్కా తీసుకుందని, అసూయపడిన భర్త తన గొంతు, మణికట్టును కోసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ బేతల్ జిల్లాలో గౌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.