తెలంగాణ వ్యాప్తంగా గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు జనజీవనం అతలాకుతలం అయింది. వానలకు నదులు, వంకలు, చెరువలు, ప్రాజెక్టులు వరద నీటితో పారుతున్నాయి. ఇక నగరంలో ఇవాళ బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులు, పాదచారులు చెట్ల కింద ఉండొద్దని నగర వాసులకు సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో అత్యవసరమైతేనే…