గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13 ఉదయం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసిందని.. లిక్కర్ షాపులు బంద్ అయ్యాయని అన్నారు. మరోవైపు.. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
ఏపీ రాజధానికి మరో హంగు రాబోతోంది. అమరావతి త్వరలో కార్పొరేషన్‌గా మారబోతోంది. రాజధానిలోని 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటుకానుంది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గుంటూరు జిల్లా కలెక్టర్. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నగరపాలక సంస్థగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ గా మార్చనుంది. రాజధానిలోని 19 గ్రామాలను ఈ కార్పొరేషన్ లో చేర్చనున్నారు. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి…