నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు.. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను జీజీహెచ్ నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు తరలించారు.. ఇక, ఆయనకు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక…