కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా వున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారాయన. దాంతో ఇప్పుడు ఆలూరు మీద పట్టు తగ్గుతోందని అంటున్నారు. జయరాం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సోదరులతోపాటు కజిన్ గుమ్మనూరు నారాయణ స్థానికంగా వ్యవహారాలు నడిపించేవారు. ఇంకా చెప్పాలంటే...అందరికంటే ఎక్కువగా నారాయణే కథ…