గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంపై బాధితులు మీడియా ముందుకు వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని సంచలన కామెంట్స్ చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయవిచారణ జరుపాలని సంతోషి గుప్త అనే బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే మా ఫ్యామిలీలో 17 మంది నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడటం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. అగ్ని…
Gulzar House: హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది.…
Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్…
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.