టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ “గల్లీ రౌడీ”. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఇక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.…