విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా…