గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అయితే, జులై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. వచ్చేనెల మొదటివారంలో గ్రూప్-4 ప్రాథమిక కీని విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది.
గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించింది. గతంలో జరిగిన పరీక్షల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది
తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-4 ఉద్యోగాలకు నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
జూన్ నెలలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరోక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని వివరించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో పోరాడి 95…
తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని… దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే టీఎస్పీఎస్పీ గ్రూప్…