Karnataka: కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలోనే వరుడు మృతి చెందాడు. నిండు నూరేళ్లు కలిసి ఉండాలని బంధువులు ఆశీర్వదించిన కొద్దిసేపటికే పెళ్లి మండపంలోనే కుప్పకూలాడు. మంగళసూత్రం వధువు మెడలో కట్టిన వెంటనే, 25 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన పెళ్లికి వచ్చిన వారితో పాటు అందర్ని షాక్‌కు గురిచేసింది.