Myth N Fact: మన ఇంట్లో చిన్న పిల్లలు అప్పుడప్పుడూ లేదా వరుసగా కొన్ని రోజుల పాటు రోజులో కొద్దిసేపు గుక్క పట్టి ఏడుస్తుంటారు. తద్వారా వాళ్లు తమ బాధను బయటికి చెప్పుకోలేక తమలోతామే తీవ్రంగా ఇబ్బందిపడటం జరుగుతుంటుంది. అలా తల్లడిల్లిపోతున్న చిన్నారులను చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. పసికందులు ఎందుకు అలా ఏడుస్తున్నారో అర్థంకాదు. ఆ సందర్భంలో ఏం చేయాలో కూడా తోచదు.