National Green Tribunal: తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం వంటి నిర్వహణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు నెలల్లో రూ.3500 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. గడువు దాటితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల…