బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం జరిగింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రాజ పట్టాభిషేకం ఇవాళ ఘనంగా జరిగింది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ జరిగింది.
లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండగులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.