ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. ఆదివారం నాడు ఏకపక్షంగా సాగిల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను 6-3, 6-3, 6-0 స్కోరు తేడాతో నాదల్ సులభంగా ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఓ మోస్తరు ప్రతిఘటన కనబర్చిన రూడ్ చివరి సెట్‌లో మాత్రం నాదల్ దూకుడుకు తలవంచాడు. దీంతో రికార్డు స్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా…