కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ వుంటుంది. అయితే నిధులు సకాలంలో అందకపోతే పరిస్థితి ఎలా వుంటుంది. ఓ గ్రామ సభలో సర్పంచ్,పంచాయితీ సెక్రటరీ కాళ్లపై పడి వేడుకుంటున్న సీన్ వరంగల్ జిల్లాలో కనిపించింది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వేడుకోవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో గ్రామ సభ గందరగోళంగా మారింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ని నిలదీశారు. గ్రామ సభకు గ్రామ స్థాయి అధికారులు…