గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లెక్సీ పై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటుని మేము అమ్ముకోమని, మా ఓటు విలువైనది – అమ్మబడదు అని…