ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, తమ సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు పైబడి గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నాం అని, సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అనిపేర్కొన్నారు. 1931లో కులగణన చేశారని, తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే మరలా ఇప్పుడు చేసిందన్నారు. లక్ష కోట్లు మహిళలందరికీ…
భగవంతుడు ఏదో కులంలో మన పుట్టుకకు అవకాశం ఇచ్చాడని, తాను గౌడ కులంలో జన్మించానని, అందుకు ఎంతో గర్విస్తున్నాను అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మనం పుట్టిన కులాన్ని గౌరవించాలి కానీ.. ఇతర కులాలను తక్కువ చేయకూడదన్నారు. కుల వ్యవస్థ, కుల వృత్తులు లేనిదే దేశం లేదు అని.. కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. గౌడ వృత్తిని గొప్ప వృత్తిగా చెప్పుకోవాలని, ప్రతిరోజు గౌడ్‌లు తాటి చెట్టు ఎక్కి దిగడం…
గౌడ్‌ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గీత కార్మిక బిడ్డగా తాను మంత్రిగా పని చేస్తున్నా అని, రాబోయే కాలంలో అందరూ ఉన్నత స్థానంలో కొనసాగేలా కష్ట పడండని సూచించారు. కుల వృత్తి పరంగా చేసేవారు చేయండని, కానీ పిల్లలకు చదువే ప్రధానంగా ఉండేలా చదివించాలన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం…